‘కస్టడీ’ కంటే ముందుగా అనుకున్న టైటిల్ ‘శివ’: నాగచైతన్య

Spread the love
  • వెంకట్ ప్రభు రూపొందించిన ‘కస్టడీ’
  • ప్రమోషన్స్  లో బిజీగా ఉన్న చైతూ
  • 4 రోజుల్లో జరిగే సంఘటనలతో నడిచే కథ అంటూ వెల్లడి
  • అరవింద్ స్వామి పాత్ర హైలైట్ అవుతుందని వ్యాఖ్య
  • శరత్ కుమార్ పవర్ఫుల్ రోల్లో కనిపిస్తారని వివరణ
Nagachaitanya Interview

నాగచైతన్య కథానాయకుడిగా వెంకట్ ప్రభు ‘కస్టడీ’ సినిమాను రూపొందించాడు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమా థియేటర్స్ కి రానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో చైతూ బిజీగా ఉన్నాడు. తాజాగా ‘గ్రేట్ ఆంధ్ర’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతూ మాట్లాడుతూ .. “ఇంతవరకూ నేను ఏ కథను విన్నప్పటికీ, వెంటనే లేచి డైరెక్టర్ ను హగ్ చేసుకున్న సందర్భాలు లేవు. అలాంటి ఒక సంఘటన ఈ సినిమా విషయంలో జరిగింది” అన్నాడు.

“వెంకట్ ప్రభు గారు నాకు ఏదైతే కథ చెప్పారో అదే తీశారు. ఈ సినిమాలో నా పాత్ర పేరు శివ. అందువలన ఈ సినిమాకి ‘శివ’ అనే టైటిల్ పెడదామని ఆయన అన్నారు. పాత ‘శివ’ సినిమాతో పోలికలు మొదలవుతాయని చెప్పి నేనే వద్దని అన్నాను. ‘కస్టడీ’ కూడా కథకి తగిన టైటిల్. ఈ టైటిల్ ను ఎందుకు సెట్ చేశామనేది సినిమా చూసిన తరువాత అర్థమవుతుంది” అని చెప్పాడు.

” తెరపై 4 రోజుల్లో నడిచే కథ ఇది .. ఈ 4 రోజుల్లో  ఏం జరిగిందనేది ఆడియన్స్ లో ఆసక్తిని పెంచుతుంది. కథ మొదలైన 40 నిమిషాలకి అరవింద్ స్వామి ఎంట్రీ ఇస్తారు. ఇక సినిమా మొత్తం కనిపిస్తారు. మా రెండు పాత్రల మధ్య లింక్ ఏంటనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక పోలీస్ ఆఫీసర్ గా శరత్ కుమార్ పాత్ర కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది” అని చెప్పుకొచ్చాడు.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com