
హైదరాబాద్ : జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వశిష్ట లైఫ్ సైన్సెస్ కెమికల్ కంపెనీలో రియాక్టర్ పేలిపోయింది. దీంతో కెమికల్ కంపెనీలోని రేకులు ఎగిరిపోయాయి. మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. రియాక్టర్ పేలడంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో సురేశ్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.