రుయా అంబులెన్స్ ల దందాపై జ‌గ‌న్ స్పంద‌న ఇదే….

Spread the love
ap cm ys jagan comments on ruia hospital incident
  • ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకూడదన్న జ‌గ‌న్‌
  • ఈ ఘ‌ట‌న‌లే వ్య‌వ‌స్థను అప్ర‌తిష్ట పాలు చేస్తాయ‌ని వ్యాఖ్య 
  • ఇప్ప‌టికే ఘ‌ట‌న‌పై ప్ర‌భుత్వం చ‌ర్య‌లు
  • ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవ‌ర్ల‌పై కేసులు, అరెస్టులు ‌
తిరుప‌తి రుయా ఆసుప‌త్రిలో చ‌నిపోయిన బాలుడి మృత‌దేహాన్ని త‌ర‌లించే విష‌యంలో ప్రైవేట్ అంబులెన్స్ మాఫియా సాగించిన దురాగ‌తంపై ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాజాగా స్పందించారు. సోమ‌వారం రాత్రి ఈ ఘ‌ట‌న చోటుచేసుకోగా.. మంగ‌ళ‌వార‌మే రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీ సీఎంను క‌లిసి ఘ‌ట‌న గురించి వివ‌రించారు. అంతేకాకుండా ఈ ఘ‌ట‌న‌కు బాధ్యుడిగా గుర్తిస్తూ ఆసుప‌త్రి సీఎస్ఆర్ఎంవోను స‌స్పెండ్ చేసిన ప్ర‌భుత్వం ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. 
మ‌రోవైపు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసు‌లు దౌర్జ‌న్యానికి పాల్ప‌డ్డ ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవ‌ర్ల‌ను గుర్తించి వారిపై కేసులు న‌మోదు చేయడంతో పాటు అరెస్ట్ కూడా చేశారు. తాజాగా ఈ ఘ‌ట‌న‌పై సీఎం జ‌గ‌న్ స్పందించారు. మరోమారు ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకూడదని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్దారు. ఇలాంటి చిన్న‌ఘ‌ట‌న‌లే మొత్తం వ్య‌వ‌స్థ‌నే అప్ర‌తిష్ట పాలు చేస్తాయ‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.
WP2Social Auto Publish Powered By : XYZScripts.com