160 కింద విచారణకు పిలిచి అరెస్ట్ చేస్తున్నారు.. హైకోర్టు నిర్ణయం తర్వాతే సీబీఐ విచారణకు హాజరవుతా: అవినాశ్ రెడ్డి

Spread the love
  • మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని నోటీసులిచ్చారన్న అవినాశ్
  • హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశానని వెల్లడి
  • హైకోర్టు నిర్ణయం వచ్చేంత వరకు సీబీఐ విచారణకు వెళ్లనని వ్యాఖ్య

వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ వేగం పెంచింది. వరుసగా అరెస్టులు చేస్తూ ఉత్కంఠను పెంచుతోంది. వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని నిన్న సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ రోజు విచారణకు హాజరుకావాలంటూ అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులు పంపింది. దీంతో, ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో అవినాశ్ పిటిషన్ వేశారు. మరోవైపు అవినాశ్ స్పందిస్తూ… 160 సీఆర్పీసీ కింద నోటీసులిచ్చి సీబీఐ అధికారులు అరెస్టులు చేస్తున్నారని అన్నారు. హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ వేశానని… హైకోర్టు నిర్ణయం తర్వాతే సీబీఐ విచారణకు వెళ్తానని, అప్పటి వరకు విచారణకు హాజరుకాలేనని చెప్పారు. న్యాయస్థానంపై తనకు నమ్మకం ఉందని అన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులిచ్చిందని చెప్పారు.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com