
- కొంతకాలంగా శంకర్ సినిమాతో చరణ్ బిజీ
- ‘ఆస్కార్’ వేడుకలకు విదేశాలకి వెళ్లిన చరణ్
- తిరిగి వచ్చిన దగ్గర నుంచి బర్త్ డే వేడుకలతో బిజీ
- ఉపాసనతో సరదాగా గడపడం కోసం దుబాయ్ కి ప్రయాణం

చరణ్ – ఉపాసన దంపతులు కొన్ని రోజుల పాటు ‘దుబాయ్’ లో సరదాగా గడవడానికి వెళ్లారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో వాళ్లను చూడటానికి అభిమానులు ఉత్సాహాన్ని చూపించారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
ప్రస్తుతం ఒక వైపున శంకర్ సినిమా షూటింగులో చరణ్ బిజీగా ఉన్నాడు. ఇక ఇటీవల ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాకి సంబంధించి ‘ఆస్కార్’ వేడుకలకు కూడా ఆయన హాజరయ్యాడు. ఆక్కడి నుంచి తిరిగి వచ్చిన దగ్గర నుంచి తన బర్త్ డే వేడుకలతో బిజీ అయ్యాడు.
అందువలన ఉపాసనతో కలిసి సరదాగా కొన్ని రోజుల పాటు గడపడం కోసం ఆయన దుబాయ్ వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత ఆయన తిరిగి శంకర్ సినిమా షూటింగులో పాల్గొననున్నాడు. ఈ సినిమా తరువాత ప్రాజెక్టును ఆయన గౌతమ్ తిన్ననూరితో చేయనున్నట్టుగా సమాచారం.