ఏపీలో ఐసెట్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

Spread the love
  • ఎంబీఏ, ఎంసీయే కోర్సుల్లో ప్రవేశాల కోసం ఐసెట్
  • మే 24, 25 తేదీల్లో ఐసెట్
  • మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 వరకు దరఖాస్తులు
  • మే 20 నుంచి అందుబాటులో హాల్ టికెట్లు

ఆంధ్రప్రదేశ్ ల ఎంబీఏ, ఎంసీయే కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే అర్హత పరీక్ష ఐసెట్. ఈ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 సంవత్సరానికి గాను దరఖాస్తుల ప్రక్రియ నేడు ప్రారంభం అయింది. ఏపీలో ఈ ఏడాది ఐసెట్ పరీక్షను అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఐసెట్ కన్వీనర్ తో పాటు ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కూడా దీనిపై వివరాలు తెలిపింది.

  • దరఖాస్తులు ఆన్ లైన్ లో చేసుకోవాలి
  • మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 వరకు దరఖాస్తుల స్వీకరణ
  • దరఖాస్తు చార్జీ రూ.650
  • బీసీలకు దరఖాస్తు చార్జీ రూ.600
  • ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రూ.550
  • మే 24, 25 తేదీల్లో ఐసెట్ పరీక్షలు
  • రెండు షిఫ్టులలో పరీక్షలు
  • ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్ష
  • మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష
  • మే 20 నుంచి అందుబాటులో హాల్ టికెట్లు
WP2Social Auto Publish Powered By : XYZScripts.com