కరోనాతో ఆస్పత్రిలో చేరిన తమిళనాడు సీఎం స్టాలిన్​

Spread the love

కరోనా బారిన పడిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వైరస్ లక్షణాలు తీవ్రం కావడంతో ఆస్పత్రిలో చేరారు. కరోనా లక్షణాలపై వైద్య పరీక్షలు, అబ్జర్వేషన్ నిమిత్తం స్టాలిన్ చెన్నైలోని ఆళ్వార్ పేటలో ఉన్న కౌవరీ ఆస్పత్రిలో చేరినట్టు ఆ ఆస్పత్రి యాజమాన్యం గురువారం ప్రకటించింది. స్టాలిన్ కు జలుబు, జ్వరం ఇతర లక్షణాలు ఉండటంతో మంగళవారమే టెస్టు చేయించుకోగా.. కరోనా పాజిటివ్ గా తేలింది. అప్పటి నుంచి ఆయన నివాసంలోనే ఉండి చికిత్స తీసుకుంటూ వచ్చారు. అయితే కరోనా లక్షణాలు పెరగడంతో ఆయనకు పలు వైద్య పరీక్షలు చేసేందుకు, ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు గురువారం ఆస్పత్రికి తరలించారు.
త్వరగా కోలుకోవాలన్న గవర్నర్..
స్టాలిన్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలంటూ తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన బుధవారమే స్టాలిన్ కు ఓ లేఖ రాశారు. ఇక తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం కూడా సీఎం స్టాలిన్ వేగంగా కోలుకుని, తిరిగి ప్రజా సేవలో అంకితం కావాలని ఆశిస్తున్నట్టు ప్రకటించారు. 

WP2Social Auto Publish Powered By : XYZScripts.com