
- సీబీఐ కస్టడీని మరో 2 రోజులు పొడిగించిన కోర్టు
- బెయిల్ పిటిషన్ ను 10న విచారిస్తామన్న కోర్టు
- జైల్లోనే హోలీ జరుపుకోవాల్సిన పరిస్థితి

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సీబీఐ ప్రత్యేక కోర్టులో నిరాశ ఎదురైంది. సిసోడియా సీబీఐ కస్టడీని మరో రెండు రోజుల పాటు సీబీఐ కోర్టు పొడిగించింది. సిసోడియా కస్టడీ ముగియడంతో ఆయనను ఈరోజు కోర్టులో సీబీఐ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. విచారణకు సిసోడియా సహకరించలేదని… ఆయనను మరో మూడు రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోర్టును సీబీఐ కోరింది.
Follow us on Social Media
సీబీఐ విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు మూడు రోజులు కాకుండా మరో రెండు రోజులు కస్టడీని పొడిగించింది. మరోవైపు బెయిల్ విషయంలో కూడా సిసోడియాకు ఎదురు దెబ్బ తగిలింది. ఆయన వేసిన బెయిల్ పిటిషన్ ను ఈ నెల 10న విచారిస్తామని కోర్టు తెలిపింది. దీంతో, హోలీ పండుగను సిసోడియా కటకటాల వెనుకే జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.