
- సిసోడియాకు ముగిసిన సీబీఐ కస్టడీ
- విచారణకు సిసోడియా సహకరించలేదన్న సీబీఐ
- తనకు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ వేసిన సిసోడియా

లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను కోర్టులో సీబీఐ ప్రవేశ పెట్టింది. ఆయన కస్టడీ గడువు ముగియడంతో కోర్టులో ప్రవేశ పెట్టింది. అయితే తమ విచారణకు సిసోడియా సహకరించలేదని, అందువల్ల ఆయనను మరో 3 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును సీబీఐ అధికారులు కోరారు. మరోవైపు సిసోడియా కూడా కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. తనను కస్టడీలో ఉంచడం వల్ల ప్రత్యేకంగా వచ్చేది ఏమీ లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. విచారణకు ఎప్పుడు, ఎక్కడకు పిలిచినా తాను హాజరవుతానని తెలిపారు. ప్రస్తుతం కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.
Follow us on Social Media