
తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఇప్పటికే రెండు విడతలుగా పూర్తి అయిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర మూడో విడతను బండి సంజయ్ ఆగస్టు 2 నుంచి ప్రారంభించనున్నట్లు బీజేపీ రాష్ట్ర శాఖ మంగళవారం ప్రకటించింది. బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? ఏ దిశగా సాగుతుంది? ఎక్కడ పూర్తి అవుతుంది? అన్న వివరాలను మాత్రం బీజేపీ రాష్ట్ర శాఖ వెల్లడించలేదు.