- బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సభలో నవ్వులు పూయించిన మంత్రి మల్లారెడ్డి
- తారకరాముడు ఐటీ రాజ్యం తెచ్చారన్న మంత్రి
- కేటీఆర్ 110 ఏళ్లు బతకాలని కాంక్షించిన మల్లారెడ్డి
- టీఆర్ఎస్ను చంద్రుడిగా, బీఆర్ఎస్ను సూర్యుడిగా అభివర్ణించిన టీఆర్ఎస్ నేత
మల్లారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో యాదాద్రి, సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక కేంద్రం, కమాండ్ కంట్రోల్ సెంటర్, కాళేశ్వరం, మిషన్ భగీరథ రూపంలో ఏడు అద్భుతాలను చూస్తున్నామన్నారు. దేశంలో కేటీఆర్ లాంటి మంత్రి మరెక్కడైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. ఇటీవల దావోస్ వెళ్లి రూ. 21 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారని ప్రశంసించారు. కేటీఆర్ 110 సంవత్సరాలు జీవించాలని కోరుకున్నారు.
కేంద్రం అసలు దొంగల్ని వదిలిపెట్టి ఐటీ, సీబీఐ, ఈడీలను తమపైకి ఉసిగొల్పుతోందన్నారు. అదానీకి అన్నీ అప్పగిస్తే పది రోజుల్లో రూ. 10 లక్షల కోట్లు ఆవిరైపోయాయని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ అంటే చంద్రుడని, బీఆర్ఎస్ అంటే సూర్యుడని అభివర్ణించారు. చంద్రుడినే ఆపలేకపోయిన వారు ఇప్పుడు సూర్యుడిని ఆపగలరా? ఆయన కోపాన్ని తట్టుకోలగలరా? అని మల్లారెడ్డి ప్రశ్నించారు. రామన్న సీఎం, కేసీఆర్ పీఎం అవుతారని జోస్యం చెప్పారు.