
- వాణీ జయరాం ముఖం, నుదుటిపై గాయాలున్నట్లు చెప్పిన పనిమనిషి
- గాయని ఇంటిని అధీనంలోకి తీసుకున్న పోలీసులు
- ఇంటి సీసీటీవీ ఫుటేజీ పరిశీలన

ప్రముఖ సినీ నేపథ్య గాయని వాణీ జయరాం ఈరోజు ఉదయం చెన్నైలో మరణించారు. అయితే ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాణీ జయరాం ముఖంపై గాయాలున్నట్లు పనిమనిషి చెప్పడంతో పోలీసులు రంగంలోకి దిగారు. గాయని ఇంటిని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈమేరకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
Follow us on Social Media
ఉదయం ఎంతసేపు కాలింగ్ బెల్ కొట్టినా వాణీ జయరాం తలుపు తీయలేదని పోలీసులకు పనిమనిషి తెలిపారు. దీంతో తలుపుబద్దలు కొట్టి లోపలికి వెళ్లినట్లు చెప్పారు. నుదురు, ముఖంపై ఎవరో కొట్టినట్లుగా తీవ్ర గాయాలు ఉన్నాయని, అప్పటికి ఆమె స్పృహలో లేరని వివరించారు.
పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత పనిమనిషి, స్థానికులు కలిసి వాణీ జయరాంను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.