
- డోపింగ్ టెస్ట్ లో పాజిటివ్ గా తేలిన వైనం
- నిషేధిత ఉత్ప్రేరకమైన హిగనమైన్ ను వాడినట్టు నిర్ధారణ
- ఈ ఏడాది జులై 10 వరకు అమల్లో ఉండనున్న నిషేధం

భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ పై 21 నెలల పాటు నిషేధాన్ని విధించారు. డోపింగ్ పరీక్షల్లో ఆమె పాజిటివ్ గా తేలింది. నిషేధిత ఉత్ప్రేరకం హిగనమైన్ ను ఆమె వాడినట్టు పరీక్షల్లో నిర్ధారణ అయింది. ఆమె డోపింగ్ కు పాల్పడినట్టు రుజువయిందని ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది.
Follow us on Social Media
2021 అక్టోబర్ 11వ తేదీన ఆమె నుంచి శాంపిల్ ను సేకరించారు. అప్పటి నుంచి ఆమె పాల్గొన్న అన్ని టోర్నీల్లోని ఫలితాలను డిస్ క్వాలిఫై చేశారు. ఈ ఏడాది జులై 10వ తేదీ వరకు ఆమెపై నిషేధం అమల్లో ఉంటుంది. నిషేధం కారణంగా ఆమె అపారటస్ వరల్డ్ కప్ తో పాటు, కనీసం మూడు వరల్డ్ కప్ సిరీస్ లకు కూడా దూరం కానుంది. సెప్టెంబర్ 23 నుంచి ఆంట్ వెర్ఫ్ లో జరగనున్న ప్రపంచ ఛాంపియన్ షిప్ లో ఆమె పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఆ వార్తతో ఆమె అభిమానులు ఆవేదనకు గురవుతున్నారు.