
- తెలుగు సినీ పరిశ్రమలో వరుస విషాదాలు
- బెంగళూరులోని నివాసంలో గురుపాదం గుండెపోటుతో మృతి
- మొత్తం 25 చిత్రాలను నిర్మించిన గురుపాదం

తెలుగు సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కళాతపస్వి కె.విశ్వనాథ్, సీనియర్ దర్శకుడు సాగర్ మరణాలను మరిచిపోక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత ఆర్వీ గురుపాదం మృతి చెందారు. ఈ ఉదయం బెంగళూరులోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. తెలుగులో ‘వయ్యారి భామలు వగలమారి భర్తలు’, ‘పులి బెబ్బులి’ చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళం భాషల్లో 25 చిత్రాలను నిర్మించారు. బాలీవుడ్ లో శ్రీదేవి హీరోయిన్ గా ‘అకల్ మండ్’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. పలు తమిళ, మలయాళ చిత్రాలను తెలుగులోకి అనువదించారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
Follow us on Social Media