
భారత్‌లో ఉక్రెయిన్ రాయబారిగా పని చేస్తోన్న ఐగర్ పొలిఖాను శనివారం బాధ్యతల నుంచి తొలగించారు. భారత్‌తో తూర్పు యూరప్ సంబంధాలపై సుదీర్ఘ అనుభవం ఉన్న యూరప్‌లోని సీనియర్ దౌత్యవేత్తల్లో ఐగర్ ఒకరు.తనను భారత రాయబారి పదవి నుంచి తప్పించడం ఆశ్చర్యం కలిగించలేదని.. అలాగని నిరాశ కూడా ఏమీ లేదని పొలిఖా తెలిపారు. ఏడేళ్లపాటు ఏదైనా దేశానికి రాయబారిగా పని చేసిన తర్వాత తిరిగి స్వదేశానికి వెళ్లడమనేది సాధారణమేనని ఆయన అభిప్రాయపడ్డారు. మళ్లీ అధికారిక ప్రక్రియ పూర్తయినప్పుడు తిరిగి వస్తానన్నారు.
2014లో క్రిమియాపై రష్యా బలగాలు దాడులు చేశాక.. కీవ్ భారత్‌లో తన రాయబారిగా పొలిఖాను నియమించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు దాడులకు దిగాయి. ఆ సమయంలో రష్యా వైఖరిని ఖండించకుండా భారత్ తటస్థంగా ఉండిపోయింది. ఈ విషయమై స్పందించిన పొలిఖా.. భారత్ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల విషయంలో భారత్ బలంగా గళం వినిపించాలని ఆయన కోరారు. ప్రధాని మోదీని పుతిన్‌తో మాట్లాడాలని కోరారు. ఖార్కివ్, కీవ్ తదితర ఉక్రెయిన్ నగరాల్లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చే సమయంలో ఆయన భారత అధికారులతో సమన్వయం చేసుకున్నారు.పొలిఖా భారత రాయబారిగా పని చేసిన సమయంలో.. భారత్, ఉక్రెయిన్ మధ్య సంబంధాలు క్రమంగా పెరిగాయి. గత ఏడాది అక్టోబర్‌లో గ్లాస్గోవ్లో జరిగిన కాప్ 26 సదస్సులో ప్రధాని మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ కావడంలో ఆయన ముఖ్యపాత్ర పోషించారు. పొలిఖా సోవియట్ యూనియన్ హయాంలోనే రాయబారిగా కెరీర్ ప్రారంభించారు. 1989లో తొలిసారిగా ఆయన సోవియట్ తరఫున భారత్‌లో రాయబారిగా పని చేశారు.