
- మరోసారి ఆసక్తికర ట్వీట్ చేసిన వర్మ
- పవన్ ను నాదెండ్ల మనోహర్ కు దూరంగా ఉండాలని సూచన
- గతంలో రాజు రవితేజ విషయంలో ఇలాగే హెచ్చరించానన్న వర్మ
- అదే నిజమైందని వెల్లడి

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనను తాను పవన్ కల్యాణ్ అభిమానినని చెప్పుకుంటారు. అయితే ఆయన పవన్ పై చేసే ట్వీట్లు కొన్నిసార్లు జనసైనికులకు, పవర్ స్టార్ ఫ్యాన్స్ కు విపరీతమైన కోపాన్ని తెప్పిస్తుంటాయి. తాజాగా వర్మ చేసిన ట్వీట్ మాత్రం ఆసక్తికరంగా ఉంది. ఈసారి ఆయన జనసైనికులకు ఓ విజ్ఞప్తి చేశారు. “ప్రియమైన జనసైనికులారా దయచేసిన మన లీడర్ ను వెన్నుపోటు నాదెండ్ల కుమారుడు నాదెండ్ల మనోహర్ కి దూరంగా ఉండమని చెప్పండి. ఇంతకుముందు పవనిజం పుస్తకం రాసిన రాజు రవితేజ గురించి ఇలాగే వార్నింగ్ ఇచ్చాను…. అతని విషయంలో నా మాటే నిజమైంది… జై జనసేన” అంటూ వర్మ వివరించారు.