
- అనంతపురం జిల్లా వెంకటాపురంలో ఘన స్వాగతం పలికిన నేతలు
- రవీంద్ర ఘాట్ వద్ద నివాళులర్పించిన తారకరత్న
- పరిటాల శ్రీరామ్ తదితరులతో కొద్దిసేపు చర్చ

మాజీ మంత్రి, దివంగత టీడీపీ నేత పరిటాల రవీంద్ర 18వ వర్ధంతి కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా వెంకటాపురంలో నిర్వహించారు. మంగళవారం ఉదయం రవీంద్ర ఘాట్ వద్ద మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, పరిటాల సిద్ధార్థ్, ఇతర కుటుంబ సభ్యులు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి పరిటాల అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ‘జోహార్ పరిటాల రవీంద్ర’, ‘పరిటాల రవీంద్ర ఆశయాలు సాధిస్తాం’ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.
Follow us on Social Media
పరిటాల వర్ధంతి కార్యక్రమానికి నందమూరి తారకరత్న కూడా హాజరయ్యారు. అనంతపురం జిల్లా వెంకటాపురంలో ఆయనకు నాయకులు ఘన స్వాగతం పలికారు. తర్వాత రవీంద్ర ఘాట్ దగ్గర తారకరత్న నివాళులు అర్పించారు. పరిటాల శ్రీరామ్, సిద్ధార్థ్, ఇతర కుటుంబ సభ్యులతో తదితరులతో ఈ సందర్భంగా తారకరత్న మాట్లాడారు. తారకరత్నను చూసేందుకు వచ్చిన అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగారు.