
- రోడ్లపై సమావేశాలు నిర్వహించకూడదు
- సమయానికి కట్టుబడి సభలను నిర్వహించుకోవాలి
- ప్రజలకు, వాహనదారులకు ఆటంకాలు కలిగించకూడదు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రకు చిత్తూరు జిల్లా పోలీసులు అనుమతి ఇచ్చారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత పాదయాత్రకు అనుమతిని ఇచ్చామని జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు. పాదయాత్ర సందర్భంగా ప్రజలకు, వాహనదారులకు, ఎమర్జెన్సీ సర్వీసెస్ రాకపోకలకు ఆటంకాలు కలిగించకూడదని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం వాటిల్లకుండా చూసుకోవాలని తెలిపారు. టపాసులను పేల్చడం నిషిద్ధమని చెప్పారు. సమయాలకు కట్టుబడి బహిరంగసభలను నిర్వహించుకోవాలని అన్నారు.
Follow us on Social Media
సమావేశ స్థలాల్లో ప్రథమ చికిత్స, వైద్య పరికరాలతో అంబులెన్సులను నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి అగ్నిమాపక యంత్రాన్ని కూడా ఉంచాలని తెలిపారు. విధుల్లో ఉన్న పోలీసులు ఎప్పటికప్పుడు ఇచ్చే ఆదేశాలను పాటించాలని చెప్పారు. రోడ్లపై సమావేశాలను నిర్వహించకూడదని తెలిపారు. మరోవైపు పోలీసుల షరతులపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.