
- చాట్ విండో ఓపెన్ చేసి సెర్చ్ బార్ లో తేదీ పేర్కొంటే చాలు
- వేరే యాప్స్ నుంచి ఫైల్స్ ను డ్రాగ్ చేసి వాట్సాప్ లో డ్రాప్ చేయొచ్చు
- మీకు మీరు సందేశాన్ని పంపుకునే ఫీచర్

మీకు మీరే సందేశాన్ని పంపించుకోవచ్చు. ఈ ఫీచర్ కూడా వాట్సాప్ యాప్ అప్ డేషన్ తో అందుబాటులోకి రానుంది. ఇతర యాప్స్ లో ఉన్న వీడియో, ఫొటోలు, డాక్యుమెంట్లను వాట్సాప్ ద్వారా షేర్ చేసుకోవాలని అనుకుంటే.. వేరే యాప్ లో ఉన్న వాటిని డ్రాగ్ చేసి తీసుకొచ్చి వాట్సాప్ లో డ్రాప్ చేసే ఫీచర్ కూడా తాజా అప్ డేట్ తో అందుబాటులోకి వస్తుంది.
వాట్సాప్ లో తేదీల వారీ సందేశాలు, మీడియా కంటెంట్ ను సెర్చ్ చేసుకునేందుకు పైన సెర్చ్ బార్ కు వెళ్లాలి. అక్కడ తేదీ, నెల, సంవత్సరం టైప్ చేస్తే చాలు ఆ రోజున ఏఏ కాంటాక్టులతో ఏమేమి షేర్ చేసుకున్నారనే వివరాలు వస్తాయి. అలాగే, చాట్ విండో ఓపెన్ చేసి, సెర్చ్ మెస్సేజ్ ను సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ కుడిచేతివైపు కార్నర్లో కేలండర్ ఐకాన్ కనిపిస్తుంది. కావాల్సిన తేదీని అక్కడ ఎంపిక చేసుకుంటే ఆ రోజు మెస్సేజ్ లు అక్కడ కనిపిస్తాయి. సమీప భవిష్యత్తులో మీడియా కంటెంట్ ను ఒరిజినల్ సైజు వే వాట్సాప్ లో పంపుకునేందుకు అవకాశం ఏర్పడనుంది.