
- మలేషియాలో బిచ్చగాడు-2 షూటింగ్
- విజయ్ ఆంటోనీ ఉన్న బోట్ మరో పడవను ఢీకొన్న వైనం
- విజయ్ ఆంటోనీకి ముఖంపై బలమైన దెబ్బలు
- మలేషియా నుంచి చెన్నైకి తరలింపు

‘బిచ్చగాడు’ చిత్రంతో తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్న తమిళ నటుడు విజయ్ ఆంటోనీ ఓ బోట్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. మలేషియాలో ‘బిచ్చగాడు-2’ షూటింగ్ జరుగుతుండగా, ఈ ప్రమాదం జరిగింది.
విజయ్ ఆంటోనీ ఉన్న బోట్ వేగంగా వస్తూ ఎదురుగా ఉన్న పడవను ఢీకొట్టింది. విజయ్ ఆంటోనీ ముఖంపై బలమైన దెబ్బలు తగిలినట్టు యూనిట్ సిబ్బంది తెలిపారు. కొన్ని పళ్లు విరిగిపోయాయని, దవడ ఎముక కూడా విరిగిందని చెబుతున్నారు.
కాగా, విజయ్ ఆంటోనీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని భార్య ఫాతిమా తెలిపారు. అతడిని మలేషియా నుంచి చెన్నై తరలించినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.