- యువశక్తి సభలో సీఎం జగన్ పై పవన్ ఫైర్
- బాబు స్క్రిప్టు ప్రకారమే పవన్ నడుస్తున్నాడన్న అప్పలరాజు
- ఊడిగం చేయడమే పవన్ పని అని వ్యాఖ్య +
- ప్యాకేజి కోసం ఏది పడితే అది చేస్తున్నాడని విమర్శలు
బాబు స్క్రిప్టు ప్రకారమే నడస్తున్న పవన్ కల్యాణ్ ఎంతసేపూ ఊడిగం చేయడమే పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు. రాజకీయం అంటే ఊడిగం చేయడం కాదనే విషయం పవన్ తెలుసుకోవాలని, నాయకుడు అంటే కార్యకర్తల్లో స్ఫూర్తి నింపాలే కానీ, ప్యాకేజీ మాటలు మాట్లాడకూడదని హితవు పలికారు. అమ్ముడుపోయిన పవన్ కు బాబును ప్రశ్నించే దమ్ము లేదని, ప్యాకేజి కోసం బాబు ఏది చెబితే అది చేస్తున్నాడని మంత్రి అప్పలరాజు విమర్శించారు.
పవన్ ఖరీదైన పగటి వేషగాడని, చంద్రబాబు నుంచి వేల కోట్లు తీసుకుని పగటివేషాలు వేస్తున్నాడని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ సభలకు పేర్లు కూడా టీడీపీనే నిర్ణయిస్తోందని అన్నారు.
పవన్ వంటి గ్రామసింహాలకు సీఎం జగన్ బెదిరిపోరని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధిపై చర్చకు పవన్ ముందుకు రావాలని, పవన్ అవగాహన ఏ స్థాయిలో ఉందో తేలిపోతుందని వ్యాఖ్యానించారు.