PK అంటే పిచ్చికుక్క: పవన్ కల్యాణ్ పై అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు

Spread the love
  • నిన్నటి సభలో వైసీపీ నేతలపై పవన్ తీవ్ర విమర్శలు
  • అంబటి రాంబాబును సంబరాల రాంబాబు అన్న పవన్
  • నీవు కల్యాణాల పవన్ అన్న అంబటి
PK means Pichi Kukka says Ambati Rambabu
నిన్న శ్రీకాకుళం జిల్లా రంగస్థలంలో నిర్వహించిన జనసేన బహిరంగసభలో వైసీపీ నేతలపై పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి ఆయన సంబరాల రాంబాబు అని విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలకు అంబటి రాంబాబు ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. నేను సంబరాల రాంబాబునైతే… నీవు కల్యాణాల పవన్ వి అని అన్నారు. అంతేకాదు… ‘PK అంటే పిచ్చికుక్క @PawanKalyan’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి రోజా డైమండ్ రాణి అయితే… నీవు బాబు గారి జోకర్ వి అని అన్నారు.
WP2Social Auto Publish Powered By : XYZScripts.com