కొత్త వ్యూహాలకు పదును పెడూతూ.. పాత సెంటిమెంట్‌లకు ప్రాధాన్యత ఇస్తున్న Revanth… ఈ సభతో నేతలంతా ఒక్కటవుతారా..!?

Spread the love

తెలంగాణలో పట్టుకోసం కాంగ్రెస్‌ కసరత్తులు ముమ్మరం చేస్తోంది. కొత్త వ్యూహాలకు పదును పెట్టడంతో పాటు.. పాత సెంటిమెంట్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ సెంటిమెంట్‌కు అనుకూలంగా ఓ భారీ బహిరంగ సభకు ప్లాన్‌ చేస్తున్నారు. అదికూడా ఆ పార్టీకి అచ్చొచ్చిన చోటే జరుపుతారట. మరి ఆ సభలోనైనా వర్గ విభేదాలు అంతమవుతాయా? హస్తం నేతలు అంతా ఒక్కటవుతారా?

సెంటిమెంట్లకు కేరాఫ్ అడ్రస్ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయనకు ఆదరణ తగ్గినప్పుడల్లా సెంటిమెంట్‌ను రగిలించడం.. దానిని పండించడం ఆనవాయితీ. అందులో కేసీఆర్‌ సక్సెస్‌ అయ్యారు కూడా. ఇప్పుడు ఇదే ట్రెండ్‌ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొనసాగించాలనుకుంటున్నారట. వరంగల్‌లో భారీ సభ నిర్వహిస్తే.. ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో తమపార్టీ అధికారంలోకి వస్తుందనేది కాంగ్రెస్ సెంటిమెంట్ అట. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఈసెంటిమెంట్ నే ఫాలో అయ్యేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

తెలంగాణలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని రాహుల్ గాంధీ ఇప్పటికే సూచించారు. వరంగల్‌లోనే సభను ఏర్పాటు చేస్తే.. సక్సెస్‌ అవడంతో పాటు సెంటిమెంటు కూడా వర్కౌట్ అవుతుందనే భావనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. అందుకే వరంగల్‌కు నేరుగా వచ్చిన రేవంత్ రెడ్డి సభా ఏర్పాట్లును స్వయంగా పర్యవేక్షించారు. జనసమీకరణపై స్థానిక నేతలతో సమావేశం అయ్యారు. ఇక్కడ సభ టీఆర్ఎస్ పార్టీ గతంలో నిర్వహించిన సభల కంటే ఎక్కువ జనాన్ని సమీకరించాలని భావిస్తోంది కాంగ్రెస్‌. వరంగల్ లో సభ సక్సెస్ అయితే… ఇక కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చే ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేయొచ్చనే ఊపు కాంగ్రెస్‌కు జీవం పోస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్ సారధ్య పగ్గాలను రేవంత్ రెడ్డి చేపట్టిన తర్వాత గులాబీ సర్కార్‌పై పోరును ఉధృతం చేసింది కాంగ్రెస్. కొత్త పీసీసీ చీఫ్‌గా నియామితులయ్యాక కార్యకర్తల్లో వచ్చిన ఊపును కొనసాగించడానికి వరుస కార్యక్రమాలు చేపట్టారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ తెచ్చిన దళితబంధు అమలుపై ప్రభుత్వ చిత్తశుద్ధిని శంఖిస్తోంది కాంగ్రెస్. దాంతో దళిత బంధుకు కౌంటర్‌గా దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా పేరుతో జనాల్లోకి వెళ్లారు కాంగ్రెస్ నేతలు. ఇంద్రవెళ్లిలో కాంగ్రెస్ ప్రారంభ సభ ఊహించిన దానికంటే గ్రాండ్ సక్సెస్  కావడంతో అదే ఊపును కొనసాగిస్తున్నారు. దీంతో మరిన్ని సభలు నిర్వహించి రాష్ట్రాన్ని చుట్టేలాయని నిర్ణయించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కార్యాచరణకు మరింత పదును పెంచారు రేవంత్ రెడ్డి.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com