
- సంక్రాంతి బరిలోకి దిగుతున్న భారీ సినిమాలు
- ఈ నెల 11న రిలీజ్ కావలసిన ‘వారసుడు’
- 14వ తేదీకి వాయిదా వేసిన దిల్ రాజు
- ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేసినా ఆడుతుందన్న శ్రీకాంత్

కొంతసేపటి క్రితం జరిగిన ఈ సినిమా ప్రెస్ మీట్ లో శ్రీకాంత్ మాట్లాడుతూ .. “ఈ సినిమా ఈ నెల 11వ తేదీన రిలీజ్ అవుతుందనే ఉద్దేశంతోనే ప్రమోషన్స్ చేస్తూ వస్తున్నాము. కానీ దిల్ రాజు గారు కాల్ చేసి 14వ తేదీకి వెళుతున్నట్టు చెప్పగానే షాక్ అయ్యాను. ఇతరుల నిర్ణయాన్ని గౌరవించి ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోవడం నిజంగా విశేషమే” అన్నారు.
“ఒక సినిమాపై ఇంత మొత్తం ఖర్చు చేసి .. పోటీపడటం మంచిది కాదని భావించి మరో డేట్ కి వెళ్లిన ఆయన మంచితనానికి నేను హ్యాట్సాఫ్ చెబుతున్నాను. ఎవరికి వారు తమ సినిమా ముందుగా బరిలో ఉండాలని కోరుకుంటారు. అలాంటి బరిలో నుంచి తప్పుకోవడం నిజంగా దిల్ రాజుగారు చేసిన సాహసంగానే చెప్పాలి. బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేసినా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది .. బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది .. ఆ నమ్మకం మాకు ఉంది” అంటూ చెప్పుకొచ్చారు.