
తొలి ఇన్నింగ్స్ లో 92 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన గడ్డు స్థితి నుంచి 416 పరుగుల భారీ స్కోరు వరకు వచ్చిన టీమిండియా… ఆపై బౌలింగ్ లోనూ విజృంభిస్తోంది. టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా బ్యాటింగ్ లోనూ చెలరేగడమే కాదు, బంతితోనూ నిప్పులు చెరుగుతున్నాడు.
బుమ్రా ధాటికి ఇంగ్లండ్ ఓపెనర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగారు. బుమ్రా తొలుత అలెక్స్ లీస్ (6)ను బౌల్డ్ చేశాడు. అనంతరం వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోగా, అంపైర్లు లంచ్ విరామం ప్రకటించారు. లంచ్ అనంతరం బుమ్రా మరోసారి విజృంభించాడు. మరో ఓపెనర్ జాక్ క్రాలే (9)ను పెవిలియన్ చేర్చాడు. దాంతో ఇంగ్లండ్ 27 పరుగులకే 2 వికెట్లు చేజార్చుకుంది.
ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 2 వికెట్లకు 30 పరుగులు కాగా… ఓలీ పోప్, జో రూట్ క్రీజులో ఉన్నారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంగ్లండ్ ఇంకా 386 పరుగులు వెనుకబడి ఉంది.