తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటివ్

తెలంగాణలో ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. హోంమంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తదితరులు కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా మంత్రి మల్లారెడ్డికి కరోనా నిర్ధారణ అయింది. ఆయన భార్య సైతం కరోనా బారిన పడ్డారు. […]

ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు ఆయ‌న భార్యాపిల్ల‌ల‌కు క‌రోనా నిర్ధార‌ణ‌

తెలంగాణ‌లో మ‌రో ఎమ్మెల్యేకు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వైరస్ బారిన పడ్డారు. కొన్ని రోజులుగా ఆయ‌న భార్య‌లో క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో మూడు రోజుల క్రితం ఆమె ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. దీంతో ఆమెకు క‌రోనా నిర్ధార‌ణ అయింది. అనంతరం నిన్న సుధీర్ […]

ఓటమి ఎరుగని నేత.. మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి చెందారు. హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గత నెల 29వ తేదీన కరోనా లక్షణాలతో ఆయన ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన ఆసుపత్రిలోనే ఉన్నారు. నంది ఎల్లయ్య వయసు […]

19 ఏళ్ల అబ్బాయి ప్రేమించి, పెళ్లి చేసుకుని మోసం చేశాడ‌ని 26 ఏళ్ల యువతి ధ‌ర్నా

ఓ 26 ఏళ్ల అమ్మాయి ఫేస్‌బుక్‌లో ఛాటింగ్ ద్వారా 19 ఏళ్ల అబ్బాయితో ప్రేమ‌లో ప‌డింది. అత‌డు చెప్పిన మాట‌లు న‌మ్మి అత‌డికి ద‌గ్గ‌రైంది. చివ‌ర‌కు పెళ్లి చేసుకున్న అనంత‌రం ఆమెను అబ్బాయి వ‌దిలేసి వెళ్లిపోయాడు. దీంతో బాధిత యువతి త‌న‌ భర్త ఇంటి ఎదుట బైఠాయించింది. త‌న‌కు […]

జీహెచ్ఎంసీ పరిధిలో తగ్గుతూ.. జిల్లాల్లో పెరుగుతున్న కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ కేసులకు అడ్డుకట్ట పడడం లేదు. నిన్న కొత్తగా  2,256 కేసులు నమోదు కాగా,  14 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 77,513కు పెరగ్గా, 615 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో ఇంకా 22,568 కేసులు యాక్టివ్‌గా […]

మా నాన్న చనిపోయింది కరోనాతోనే అయినా.. చంపింది కరోనా కాదు: సున్నం రాజయ్య కుమారుడు

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నేత సున్నం రాజయ్య కరోనా బారిన పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. పార్టీలకు అతీతంగా ఆయన మరణం పట్ల నేతలు సంతాపం ప్రకటించారు. అయితే, ఆయన కుమారుడు విడుదల చేసిన ఓ ఆడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన తండ్రి […]

బెంగళూరులో తెలుగు ఐటీ ఉద్యోగిని అనుమానాస్పద మృతి

కామారెడ్డి ప్రాంతానికి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని బెంగళూరులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కామారెడ్డికి చెందిన 25 ఏళ్ల శరణ్య బెంగళూరులోని ఓ సంస్థలో పనిచేస్తోంది. శరణ్యది ప్రేమవివాహం. తనతో పాటు కలిసి చదివిన రోహిత్ ను ప్రేమించి పెళ్లాడింది. రోహిత్, శరణ్య బెంగళూరులోనే ఉంటున్నారు. […]

తెలంగాణలో 75 వేలు దాటిన కరోనా కేసులు

తెలంగాణలో కొవిడ్‌-19 కేసుల విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 2,207 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదే సమయంలో  1,136 మంది కోలుకోగా, 12 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇక […]

నేటి నుంచే సాగర్‌ ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో నీటి విడుదల: కేసీఆర్ కీలక‌ నిర్ణయం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నాగార్జున సాగర్‌ ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయాలని‌ నీటిపారుదల శాఖ అధికారులను ఆయన ఆదేశించారని తెలంగాణ సీఎంవో ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ రోజు నుంచే నీటి విడుదల ప్రారంభం కావాలని నాగార్జున సాగర్ సీఈని ఆదేశించారని […]

లాక్ డౌన్ నేపథ్యంలో పెరుగుతున్న గృహహింస… ఇంటి వద్దకే పోలీసు సేవలు అందిస్తున్న మహబూబ్ నగర్ ఎస్పీ

యావత్ ప్రపంచం కరోనా మహమ్మారితో సతమతమవుతున్న వేళ కూడా మహిళలకు గృహహింస తప్పడంలేదన్న కఠోర నిజం ఎంతో బాధిస్తుంది. సాధారణ పరిస్థితుల్లోనే మహిళలు తమకు ఎదురైన గృహ హింసపై బయట చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఇక లాక్ డౌన్ వేళ కాలు బయటపెట్టే వీల్లేక, భర్త, ఇతర కుటుంబసభ్యుల […]