సిరిసిల్లలో విషాదం.. వైద్యం వికటించి ఇద్దరు మహిళలు మృతి

సిరిసిల్లలో విషాదం: Latest News, Photos, Videos ...సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వైద్యం వికటించి వేర్వేరు కుటుంబాలకు చెందిన ఇద్దరు మహిళలు మృతిచెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. సిరిసిల్ల పట్టణంలోని తేజ ఆస్పత్రిలో ఇదే పట్టణంలోని గణేష్ నగర్‌కు చెందిన కల్పన అనే మహిళ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం జాయిన్ అయ్యింది. రుద్రంగి మండలం మానాలబడి తండాకు చెందిన మాలోత్ షీలా(27) ఇదే ఆస్పత్రిలో పైల్స్ ఆపరేషన్ కోసం చేరింది. అయితే వీరికి ఆస్పత్రి సిబ్బంది చికిత్స అందించారు. ఏమైందో ఏమోగానీ వారిద్దరూ వైద్యం వికటించి చనిపోయారు. దీనికి కారణమైన తేజ ఆస్పత్రిని వెంటనే సీజ్ చేయాలంటూ బంధువులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రి యాజమాన్యంపై కేసు పెట్టాలని మృతురాలి బంధువులు ఆరోపించారు.