భానుడి భగభగ…అగ్నిగుండంగా హైదరాబాద్…నేటి వాతావరణ సమాచారం…

సూర్యుడు భగభగమంటున్నాడు. ఉదయం నుంచే ఎండలు మండిపోతుండడంతో తెలంగాణలోని పలు జిల్లాలు అగ్నిగుండంగా మారుతున్నయి. దీనికి తోడు గాలిలో తేమ తక్కువగా ఉండడంతో వడగాలులు వీస్తున్నాయి. ఉక్కపోత ఎక్కువై జనం విలవిలలాడుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు నగరంలో గరిష్ఠం 42.7, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.9 డిగ్రీల సెల్సియస్‌, గాలిలో తేమ 14 శాతంగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక శనివారం వాతావరణం కూడా ఎండలు మండుతాయని వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు 41-43 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందని తెలుపుతున్నారు.