హైదరాబాద్‌లో రోడ్డెక్కనున్న బస్సులు.. వారికి మాత్రమే..

తెలంగాణలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కి నాలుగు రోజులవుతున్నా… హైదరాబాద్ వాసులకు మాత్రం బస్సు సౌకర్యం ఇంకా లభించలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం… హైదరాబాద్‌లోని సిటీ బస్సులకు మాత్రం ఇంకా పచ్చజెండా ఊపలేదు. ప్రభుత్వం నిర్ణయం కారణంగా అనేకమంది ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని కొందరు ఉద్యోగులు సర్కార్ దృష్టికి తీసుకెళ్లడంతో… ప్రభుత్వ ఉద్యోగుల కోసం శనివారం నుంచి హైదరాబాద్‌లో ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఉద్యోగుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ అనుమతించారు. ఉద్యోగులు తప్పనిసరిగా గుర్తింపు కార్డు చూపిస్తేనే బస్సులోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలోని 32 రూట్లలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.