ఇసుక మద్యం అక్రమార్కులపై…280 కేసులు..180 మంది నిందితులు పట్టివేత

గంగాధర నెల్లూరు మండలం నందనూరు రీచ్ లో ఏపిఎండీసి బిల్లులను ఫోర్జరీ చేసి ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్న స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో 14 మందిపై కేసు నమోదు చేసి 5 గురిని అరెస్ట్ చేసి రిమాండుకు పంపింది. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ ఏ.ఎస్.పి. వై. రిశాంత్ రెడ్డి ఈరోజు చిత్తూరులో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గంగాధరనెల్లూరు మండలంలోని నందనూరు ఇసుక రీచ్ లో అక్రమాలు జరిగాయని అందువలన అనుమతులను రద్దు చేయాలని కలెక్టర్ కు లేఖ రాసినట్లు తెలిపారు. ఈరీచ్ నుంచి డూప్లికేట్ బిల్లులతో ఇసుకను అక్రమ రవాణా చేసి ప్రభుత్వానికి ఆదాయం రాకుండా గండి కొట్టుకున్నారని గుర్తించిన పీఏ ఎస్పీ రీచ్ను తనిఖీ చేసిపరీక్షలో పనిచేస్తున్న వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో అక్రమ మద్యం , అక్రమ ఇసుక రవాణా సమాచారం కోసం కాల్ సెంటర్ నెంబరు 9440900004 నూతనంగా ఏర్పాటు చేయడం జరిగిందని ఇకపై అక్రమ రవాణా సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. జిల్లాలో ఎక్కువగా మద్యం, ఇసుక కేసులున్నవారిపై పీడి యాక్టు ప్రయోగించడానికి రంగం సిద్ధం చేస్తున్నామని అన్నారు అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపడం జరుగుతుందని హెచ్చరించారు. రీచ్ లను ఆపరేట్ చేస్తున్న ఓనర్లు ప్రభుత్వ నిబందనలకు అనుగుణంగా నడుచుకోవాలని.లేని పక్షంలో చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వారం రోజుల్లో ఇసుక మద్యం అక్రమార్కులపై 280 కేసుల్లో, 180 నిందితులు పట్టుకోవడం జరిగిందని. ఇక మీదట ఈ దాడులను వేగవంతం చేస్తా మన్నారు. ప్రజలు తమ నెంబరుకు సమాచారం అందించి అక్రమరవాణా నియంత్రించాలని ఏ.ఎస్.పి. వై. రిశాంత్ రెడ్డి కోరారు.