అప్పు తీర్చనందుకు సొంతబావనే చంపిన బామ్మార్ది.. అప్పు ఎంతో తెలిస్తే షాక్..

ఓ వ్యక్తి తీసుకున్న అప్పు తీర్చకపోవడంతో సొంత బావనే చంపిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. అయితే ఇంతకీ ఆ అప్పు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే. కేవలం రూ.2వేల కోసం ఓనిండు ప్రాణం బలయ్యింది. పూర్తివివరాల్లోకి వెళితే.. పెద్దారవీడు మండలం చెంచుగిరిజన కాలనీకి చెందిన మండ్ల రాజయ్య(30), కుడుముల చెన్నయ్య వరుసకు బావ బామ్మార్దులు. అయితే ఏదో అవసరం నిమిత్తం రాజయ్య తన బామ్మార్ది అయిన చెన్నయ్య వద్ద రూ.2 వేలు అప్పు తీసుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల రాజయ్య తీసుకున్న అప్పును చెల్లించలేకపోయాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి బావ, బామ్మార్దులిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహించిన కుడుముల చెన్నయ్య తన వద్ద ఉన్న బాణం రాజయ్యపైకి వేశాడు. బాణం రాజయ్య శరీరంలోకి బలంగా దిగింది. దీంతో రాజయ్య అక్కడికక్కడే చనిపోయాడు.