కరోనా ఆకలి కేకలు… చచ్చిన కుక్కను తిన్న వలస కూలీ…

ఎంత ఆకలి ఉన్నా… చచ్చిన కుక్కను తినే సాహసం ఎవరూ చెయ్యరు. అందుకు కూడా సిద్ధపడ్డాడంటే… ఆ వలస కూలీ ఎంత ఆకలితో ఉండి ఉండాలి. ప్రాణం పోయే పరిస్థితి వస్తేనే కదా అలా చేస్తారు. నిజమే… దేశంలో చాలా మంది వలస కూలీల దయనీయ పరిస్థితులు ఇలాగే ఉంటున్నాయి. కొంత మంది ప్రయాణం చేస్తూనే చనిపోతున్నారు. ఈ కుక్కను తిన్న విషాదం జరిగింది… రాజస్థాన్… జైపూర్‌లో. ఢిల్లీ – రాజస్థాన్‌ని కలిపే జైపూర్ హైవేపై… రోడ్డు ప్రమాదంలో ఓ కుక్క చనిపోయింది. ఎప్పుడు పోయిందో తెలీదు. అటుగా రాజస్థాన్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఓ వలస కూలీ… ఆ కుక్కను తింటూ కనిపించాడు. అది చూసిన… ఓ కారు ఓనర్ షాక్ అయ్యారు. ఏమైంది, ఎందుకిలా చేస్తున్నావని అడిగితే… ఆకలి కేకల కన్నీటి కథలు చెప్పాడు. షాక్ అయ్యాడు ఆయన.

Ananya Bhatnagar@anany_b

A heartbreaking video from highway, a man who wasn’t having food, was eating a dead dog.@yogitabhayana @India_NHRC @ashokgehlot51 @SachinPilot @DC_Gurugram @JaipurCongress

కేంద్రం వలస కూలీలు తమ తమ రాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రత్యేక శ్రామిక్ రైళ్లను తెచ్చింది. ఐతే… ఆ రైళ్లలో ఉచిత సీటు కన్ఫామ్ అయ్యేందుకు కనీసం 2 వారాల టైమ్ పడుతోంది. ఆ రెండు వారాలు ఎలా గడవాలో తెలియక, చేతిలో డబ్బు లేక… ఇబ్బంది పడుతూ… ఇదంతా అయ్యే పని కాదులే అనుకుంటూ… బండెడు లగేజీ మోసుకుంటూ… మండుటెండల్లో వలస కూలీలు నడుస్తూ వెళ్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుత కథలో… కుక్కను తింటున్న వలస కూలీని కాపాడిన వాహనదారు… తమ దగ్గర ఉన్న కొంత ఆహారాన్ని అతనికి పెట్టి ఆకలి తీర్చారు. అలా అతన్ని కాపాడారు. ఈ కరోనా ఎప్పుడు వదులుతుందో… ఈ బాధలు ఎప్పుడు తీరుతాయో…