శ్రీవారి ఆస్తుల వేలం… టీటీడీ కీలక నిర్ణయం

నిరుపయోగంగా ఉన్న శ్రీవారి ఆస్తులను విక్రయించాలని టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని 23చోట్ల ఉన్న శ్రీవారి ఆస్తులను విక్రయించేందుకు టీటీడీ రంగం చేస్తోంది. ఇందుకోసం గతంలోనే టీటీడీ పాలక మండలిలో తీర్మానం చేశారు. అప్పట్లోనే దీనిపై 8 కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. ఆస్తుల విక్రయానికి బహిరంగ వేలం నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేసే అధికారాలను టీటీడీ అధికారులకు కట్టబెట్టారు. మరోవైపు టీటీడీ నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శ్రీవారి ఆస్తులను తమవారికి కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కొందరు విమర్శిస్తున్నారు. ఆ స్థలాల్లో హిందూ ధర్మ ప్రచారం జరగాలన్నారు. టీటీడీ ఆస్తుల విక్రయంపై జనసేన నేతల మండిపడ్డారు. న్యాయపోరాటం చేస్తామన్నారు.