తెలంగాణ పోలీసు శాఖకు మరో షాకింగ్ న్యూస్..డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ కు కరోనా పాజిటివ్‌.

తెలంగాణ పోలీసు శాఖకు మరో షాకింగ్ న్యూస్ ఇది. రోజురోజూకీ పెరుగుతున్న కరోనా కేసులు పోలీసు శాఖను కలవరపెడుతున్నాయి. అయితే ఇప్పటివరకు తెలంగాణ పోలీసుల్లో ఏడు కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ క్రమంలో బుధవారం కుల్సుంపురా పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్ కరోనా వైరస్ సోకి చనిపోయిన సంగతి మరువకముందే.. పోలీసు శాఖకు మరో బ్యాడ్ న్యూస్ తెలిసింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ సుధీర్ కృష్ణకు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. దీంతో అతడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా బాలాపూర్ పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బందిని హోమ్ క్వారంటైన్‌కు తరలించారు. సుధీర్ కృష్ణ.. హబ్సీగూడలోని రోడ్డు నంబరు 8లో నివాసం ఉంటున్నాడు. దీంతో కుటుంబ సభ్యులను సైతం హోం క్వారంటైన్ చేసినట్టు వైద్యాధికారులు తెలిపారు. ఏదిఏమైనా వరుస కరోనా కేసులు పోలీసు శాఖను కలవరపెడుతున్నాయి.