కన్నకూతురిపై తండ్రి అత్యాచారం.. రక్షిస్తానని చెప్పి మరో వ్యక్తి..

సమాజంలో రోజురోజూకీ మానవత్వపు విలువలు మంటగలిసిపోతున్నాయి. వావివరసలు మరిచి కామంతో కళ్లుమూసుకుపోయి మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. ఓ తండ్రి తన కన్నకూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం పోలీసుల వరకు వెళ్లడంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఏలూరులోని పెదవేగి మండలానికి చెందిన ఓ దంపతులకు 14 సంవత్సరాల కూతురు ఉంది. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూతురిని బెదిరించి పలుమార్లు తండ్రి అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని తల్లితో చెబితే చంపేస్తానని బెదిరించేవాడు. చివరకు తండ్రి లైంగిక వేధింపులు భరించలేక ఈనెల 16న ఇంటి నుంచి బయటకు వచ్చి ఏలూరు వైపు వస్తుంది. బాలికను గమనించిన ఓ అపరిచత వ్యక్తి న్యాయం చేస్తానని చెప్పి ఏలూరులో ఓ గదిలో ఉంచి ఆ మరుసటి రోజు బాలిక తల్లిదండ్రులకు అప్పగించాడు.

అప్పుడే అతడు ఆమె తల్లికి అఘాయిత్యం విషయం చెప్పాడు. అయితే తనను గదిలో ఉంచిన వ్యక్తి సైతం బలాత్కారం చేయబోయాడని బాలిక పోలీసులుకు చెప్పింది. అయితే బాలిక తల్లి గురువారం ఏలూరులోని దిశ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో డీఎస్పీ ఫైడేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పోలీసు స్టేషన్‌లో తనపై కేసు నమోదైన సంగతి తెలుసుకున్న బాలిక తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు వఅతడిని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తుండగా, గదిలో ఉంచి అత్యాచారం చేయబోయిన అపరిచిత వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.