ఏపీలో కరోనా విజృంభన.. 24 గంటల్లో 62 మందికి సోకిన వైరస్..`

ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. కేవలం 24 గంటల్లోనే కొత్తగా 62 మందికి కరోనా సోకింది. ఏపీ ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం.. నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు 8,415 శాంపిల్స్‌ను పరీక్షించారు. అందులో తాజా కేసులు బయటపడ్డాయి. అటు.. రోజు వ్యవధిలో 51 మంది కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా, వ్యాధి తీవ్రత ఎక్కువై కృష్ణా జిల్లాలో ఒక వ్యక్తి మరణించాడు. మొత్తం మరణించిన వారి సంఖ్య 55కు చేరింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 2514 పాజిటివ్ కేసులకు గాను 1731 మంది డిశ్చార్జి కాగా ప్రస్తుతం 728 మంది చికిత్స పొందుతున్నారు.