మెదక్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం!

మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం అల్లాదుర్గం మండలం రాంపూర్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. బైక్ ను ట్రాక్టర్ డోజర్ ఢీకొనడం తో ఓ వ్యక్తి అక్కడే ప్రాణాలు కోల్పోయాడు.కాగా ఈ ఘటనలో వ్యక్తి తల మొండెం నుండి వేరుగా విడిపోయి మరో చోట పడటం తో ఆ దృశ్యం చూపరులకు భయానకంగా కనిపించింది.మృతుడు మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం ఉత్తలూరు గ్రామానికి చెందిన దుర్గయ్య గా గుర్తించారు. దుర్గయ్య రాంపూర్ శివారు లో ఉన్న ఓ రైస్ మిల్ లో గుమాస్తాగా విధులు నిర్వర్తిస్తున్నాడు. దుర్గయ్య తన గ్రామం నుండి రైస్ మిల్ కు వచ్చే సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ అదే రైస్ మిల్ కి చెందింది కావడం దురదృష్టకరం. ఘటనా స్థలంలో మృతుడి బంధువుల రోదనలు మిన్నంటాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసలు దర్యాప్త్తు ప్రారంభించారు.