రక్తమోడిన రహదారి…ఆగివున్న లారీని ఢీకొన్న కారు…ముగ్గురు మృతి

విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి రక్తమోడింది. నల్గొండ జిల్లాలోని చిట్యాల శివారులో ఉన్న రిలయన్స్ పెట్రోల్‌ బంక్ వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నిలిపి ఉన్న ధాన్యం లారీని వెనక నుంచి ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన స్థానిక కామినేని ఆస్పత్రికి తరలించారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి నుంచి హైదరాబాద్ వెళుతుండగా జాతీయ రహదారి (NH65)పై ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు సమాచారం. సంఘటన స్థలానికి చేరుకున్న డిఎస్పీ వెంకటేశ్వరరెడ్డి పంచనామా నిర్వహించి మృతదేహాలను నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన ముగ్గురు రాజమండ్రి దగ్గర కొత్తపల్లి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ముగ్గురు మాత్రం క్షతగాత్రులకుగా చికిత్స పొందుతున్నారని పోలీసులు చెప్పారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఎనిమిది మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది.