తెలంగాణలో ఎన్ని కరోనా టెస్టులు చేశారో.. లెక్క లేదంటున్న కేంద్రం..?

తెలంగాణలో కరోనా టెస్టులపై వివాదం జరుగుతున్న నేపథ్యంలో కేంద్రం విడుదల చేసిన జాబితా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాష్ట్రంలో అసలు ఎన్ని కరోనా టెస్టులు చేశారన్న లెక్క కేంద్రం వద్ద లేనట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వమే టెస్టుల జాబితా అందించలేదా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎంత మందికి కరోనా వచ్చింది? ఎన్ని యాక్టివ్ కేసులున్నాయి? ఎంత మంది రికవరీ అయ్యారు? ఎంత మంది చనిపోయారు? అన్న వివరాలను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అందించినట్లు నివేదిక ప్రకారం తెలుస్తోంది. ఎన్ని టెస్టులు చేశారు? అన్న వివరాలు మాత్రం జాబితాలో లేవు. జాబితా ప్రకారం.. టెస్టుల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది. మహారాష్ట్రలో 2,93,921 మందికి టెస్టులు చేయగా, ఏపీలో 2,67, 609 టెస్టులు చేశారు. అదే తెలంగాణలో ఎన్ని టెస్టులు చేశారన్నది మాత్రం లేదు.

ఇక, ఈ రోజు ఉదయం 9 గంటల నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 25,12,388 మందికి కరోనా టెస్టులు చేశారు. అందులో 1,06,811 మందికి వైరస్ సోకింది. 3,302 మంది చనిపోగా.. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 39.61శాతంగా ఉంది.