కరోనా ఎఫెక్ట్… వైన్ షాపుల దగ్గర ఇలాంటి సిత్రాలు… ఎవ్వర్ బిఫోర్… నెవ్వర్ ఆఫ్టర్…

ఫొటోలో చూశారుగా… ప్రజలు ఎలా విడివిడిగా నిల్చున్నారో… ఇదంతా కరోనా వైరస్ మహిమ. ఎప్పుడైతే ఆ మహమ్మారి తెలంగాణలో ఎంటరైందో… ప్రభుత్వం, అధికారులు… అన్ని అప్రమత్త జాగ్రత్తలూ తీసేసుకుంటున్నారు. ఫలితంగా ఎప్పుడూ జనంతో కిటకిటలాడుతూ… గుంపులుగుంపులుగా… జనమే తప్ప షాపు కనిపించనంతగా కిక్కిరిసిపోయే వైన్ షాపులు… ఇప్పుడు ఇదిగో ఇలా దూరం దూరంగా జనాన్ని నిల్చోబెడుతున్నారు. ప్రజెంట్ ఈ సినారియో… మనకు యాదాద్రి భువనగిరి జిల్లాలో కనిపిస్తోంది. కరోనా వైరస్ ప్రబలకూడదంటే… ప్రజలు సమూహాలుగా ఉండకూడదు కదా… అందుకని వైన్ షాపులకు వచ్చే వారు గుంపులుగా ఉండకుండా… ఇదిగో ఇలా… సున్నంతో నిలువు, అడ్డ గీతలు గీసేశారు. ఎవరైనా సరే… మందు కావాలంటే… ముందు లైన్లో నిలబడాలి. ఒక్కో గడియనూ దాటుకుంటూ… వన్ బై వన్ వెళ్లాలి. అప్పుడే చేతిలో బాటిల్ పడుతుంది. లేదంటే… పోలీసులు పట్టుకుపోతారు.రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో… ఇలా వైన్ షాపుల ముందు సోషల్ డిస్టాన్స్ అనేది స్టార్ట్ చేశారు. ఇకపై వైన్ షాపుల ముందు ఎవ్వరైనా సరే మందు కోసం క్యూలో డిస్టాన్స్ మెయింటేన్ చేస్తూ నిలబడాల్సిందే. ఇదో మంచి నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే… ప్రజలు గుమికూడినా, సమూహంగా చేరినా… కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతోంది. అదే ఇలా దూరం దూరంగా ఉంటే… గబుక్కున ఎవరైనా తుమ్మినా, దగ్గినా… ఆ తుంపర్లు ఇతరులపై పడవు. తద్వారా… ఒకవేళ తుమ్మిన వారికి కరోనా వైరస్ ఉంటే… అది మిగతా వాళ్లకు చేరదు. ఇలాంటి మంచి నిర్ణయాల్ని, చర్యల్నీ ప్రజలు స్వాగతించడం ప్రజలకే మంచిది. మన మంచి కోసమే అని ఫాలో అయితే… కిక్కూ దక్కుతుంది, వైరస్ చిక్కూ తప్పుతుంది.