ఎదురుదెబ్బలు తగులుతాయి..తట్టుకుని నిలబడాలి : పూజా హెగ్డే..

పూజా హెగ్డే..  నాగచైతన్య ‘ఒక లైలా కోసం’తో పరిచయమైన వరుణ్ తేజ్ సరసన ‘ముకుంద’ సినిమాలో నటించి తెలుగు వారికి మరింతగా దగ్గరైంది. ఆ తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలుల అందిపుచ్చుకుంటూ  ప్రస్తుతం తెలుగులో చాలా బీజీగా ఉన్న హీరోయిన్‌లో ఒకరుగా ఉన్నారు. ఈ భామ టాప్ హీరోల అందరితోను ఆడిపాడింది.  అల్లు అర్జున్ సరసన ‘డీజే’ లోహాట్‌గా అదరగొట్టిన ఈ భామ.. ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత’లో క్యూట్‌గా మైమరిపించింది.  తర్వాత  మహేష్‌ బాబుతో కలసి ‘మహర్షి’లో చేసి మంచి హిట్ అందుకుంది.  తాజాగా  బన్ని సరసన ‘అల వైకంఠపురములో’ నటించి అదిరిపోయే హిట్ అందుకుంది. వరుస హిట్లతో ఊపు మీద ఉన్న ఈ ముద్దుగుమ్మ ఆ మధ్య మీడియాతో మాట్లాడుతూ.. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేందుకు నేనెప్పుడూ ముందే ఉంటానని.. జీవితంలో సాహసాలు చేయడం చాలా అవసరం అని చెబుతూ.. అవే మనల్ని అందరిలో ప్రత్యేకంగా నిలబెడతాయంటోంది. జీవితాన్ని కంఫర్టబుల్‌గా బతకడంలో ఆనందం ఉందనుకుంటారు. అందులో భాగంగానే.. ఒకే రకమైన లైఫ్‌కు అలవాటు పడిపోతుంటారు. అలా బతకడంలో తప్పు లేదు.. కానీ మనకంటూ ఓ గుర్తింపు రావాలంటే మాత్రం.. పదిమందికంటే భిన్నంగా ఆలోచించాల్సిందే అంటోంది.  మనం కొత్తగా ప్రయత్నిస్తే.. ఎదురుదెబ్బలు తగులుతాయి. వాటిని తట్టుకుని నిలబడాలని చెబుతోంది.

పూజా ఇంకా మాట్లాడుతూ.. సినిమాలు మనకెందుకు.. అనుకుంటే చాలామంది అమ్మాయిల్లానే నేనూ చదువు ,ఉద్యోగం అంటూ మిగిలిపోయేదాన్నని… కాని ‘ఓసారి ట్రై చేసి చూద్దాం’ అని గట్టిగా అనుకున్నాను అంతే.. అయితే.. ఈ ప్రయాణంలో మొదట కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ చివరికి మాత్రం నా గమ్యాన్ని చేరుకున్నానంటోంది. పూజా ప్రస్తుతం ప్రభాస్ సరసన ఓ సినిమా చేస్తోంది. దాంతో అఖిల్ హీరోగా వస్తోన్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ అనే సినిమాలోను నటిస్తోంది.