ఆ విషయంలో చైనాను దాటేసిన ఇటలీ..

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ అసలు మొదలయ్యింది చైనాలోనే. ఈ వైరస్ ధాటికి చైనా అతలాకుతలమయ్యింది. అనంతరం కరోనా వైరస్ ఇతర దేశాలకు పాకింది. అయితే కరోనా వైరస్‌పై చైనా అలుపెరగని పోరాటం చేయడంతో కాస్తంత ఉపశమనం కలిగింది. చైనాలో వ్యాధి విజృంభించిన తర్వాత మొదటిసారిగా ఒక్కకేసు కూడా నమోదు కాలేదని అక్కడి ఆరోగ్య శాఖ తెలిపింది. చైనా అధికార యంత్రాంగం పక్కా ప్రణాళికతో ఎక్కడికక్కడ అందరినీ నిర్బంధంలో ఉంచింది. ఫలితంగా నెల రోజుల క్రితం రోజుకి వెయ్యి కేసులు నమోదయ్యే చోట ప్రస్తుతం ఒక్క కేసు నమోదు కాలేదు. ఇదిలావుంటే.. కరోనా వైరస్ మరణాల్లో ఇటలీ చైనాను దాటేసింది. ఇటలీలో తాజాగా మరో 427 మంది చనిపోవడంతో ఫిబ్రవరి నుంచి ఈ వ్యాధితో చనిపోయిన వారి సంఖ్య 3405కు చేరుకుంది. చైనాలో గురువారం నాటికి మరణాల సంఖ్య 3245గా నమోదయ్యింది.

ఏ దేశంలో ఎన్నికేసులు నమోదయ్యాయంటే..

దేశం                              సంఖ్య

చైనా                              80,928

ఇటలీ                             35,713

ఇరాన్                            18,407

స్పెయిన్                         17,395

జర్మనీ                            13,632

అమెరికా                          9,480

ఫ్రాన్స్                              9,134

ద.కొరియా                        8,565

స్విట్జర్లాండ్                        3,438

బ్రిటన్                              2,626