దిగి వచ్చిన చైనా…యువ వైద్యుడి కుటుంబానికి సారీ…

కరోనా వ్యాప్తిని తొలిసారి గుర్తించి ప్రపంచం దృష్టికి తెచ్చిన యువ వైద్యుడు లీ వెన్ లియాంగ్ (34)పట్ల తాము వ్యవహరించిన తీరుపట్ల చైనా ప్రభుత్వం క్షమాపణ తెలిపింది. కరోనా వైరస్ తొలి దశలోనే ఏడుగురు వ్యక్తుల్లో సార్స్ ను పోలిన వైరస్ ఒకటి అత్యంత ప్రమాదకారిగా మారే అవకాశం ఉందని లీ హెచ్చరించాడు. ఇదే విషయాన్ని గత సంవత్సరం డిసెంబర్ 30న సోషల్ మీడియాలో ఒక ఆర్టికల్ ద్వారా తెలియజేస్తూ పేర్కొన్నాడు. దీంతో తొలిసారిగా కరోనా గురించి ప్రపంచానికి తెలిసింది. అయితే ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యే అవకాశం ఉందని ఊహించిన పోలీసులు ఆ యువవైద్యుడి పట్ల కఠినంగా వ్యవహరించారు. విషయం బయటకు పొక్కితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. అయితే దురదృష్టవశాత్తూ డాక్టర్ లీ జనవరి 10న కరోనా సోకి కొద్ది రోజులకే మరణించాడు. అతడి మరణం చైనాలో సంచలనమైంది.