Breaking News

నిర్భయ’ తీర్పు చదువుతూ స్పృహ తప్పిన సుప్రీం జడ్జి

సుప్రీం న్యాయమూర్తి జస్టిస్​ ఆర్​ భానుమతి కోర్టులో స్పృహ కోల్పోయారు. నిర్భయ దోషులకు విడివిడిగా ఉరిశిక్ష అమలు చేయాలని కోరుతూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్​పై కోర్టు తీర్పు చదువుతూ ఆమె అస్వస్థతకు గురయ్యారు.

అయితే వెంటనే ఆమె స్పృహలోకి రాగా.. ఇతర న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది ప్రాథమిక చికిత్సకోసం చక్రాల కుర్చీపై ఆమెను ఛాంబర్​కు తీసుకువెళ్లారు.

అయితే ఈ పిటిషన్​పై తీర్పును ఛాంబర్​లో తెలుపుతామని జస్టిస్​ ఏస్​ఏ బోపన్న వెల్లడించారు.

తీవ్ర జ్వరం…

జస్టిస్​ ఆర్​ భానుమతి ఆరోగ్య పరిస్థితి గురించి సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా తెలిపారు.

 

“జస్టిస్​ ఆర్​ భానుమతి తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. ఛాంబర్​లో ఆమెను వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. కేసు విచారణ సమయంలోనూ ఆమె జ్వరానికి మందులు వేసుకున్నారు” – తుషార్​ మెహతా, సొలిసిటర్​ జనరల్

Tags

Related Articles

Back to top button
Close