ANDHRA PRADESHBreaking News

పవన్ కళ్యాణ్ మనసులో ఏముంది ? జనసేనలో సస్పెన్స్

వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తిరుపతి నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు

చ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక నుంచి పోటీ చేశారు. రెండు చోట్ల ఓటమి చవిచూశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన ఈ రెండు సీట్లను దాదాపుగా పక్కనపెడతారనే టాక్ బలంగా వినిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో రాయలసీమలోని తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని జనసేనలోకి కొందరు గట్టిగా కోరుతున్నట్టు తెలుస్తోంది. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం తరపున ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

2009 ఎన్నికల్లో పోటీ చేసిన చిరంజీవి… పాలకొల్లులో ఓడిపోయినా… తిరుపతి మాత్రం ఆయనను విజేతగా నిలిపింది. దీంతో పవన్ కళ్యాణ్‌కు కూడా తిరుపతి కలిసొస్తుందని… ఆయనను కచ్చితంగా అసెంబ్లీకి పంపిస్తుందని జనసేన కార్యకర్తలు నమ్ముతున్నారు. ఇదే విషయాన్ని చిత్తూరుతో పాటు తిరుపతికి చెందిన జనసేన నాయకులు, కార్యకర్తలు ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.

అయితే పవన్ కళ్యాణ్ మాత్రం దీనిపై వారికి ఎలాంటి హామీ ఇవ్వలేదని సమాచారం. మరోవైపు తాను ఎక్కడి నుంచి పోటీ చేసే విషయంపై ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం సాధ్యంకాదని పవన్ కళ్యాణ్ తన సన్నిహితుల దగ్గర చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్టీఆర్, చిరంజీవి వంటి వారిని అసెంబ్లీకి పంపించిన తిరుపతి నుంచే పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీకి వెళితే బాగుంటుందనే టాక్ జనసేనలో రోజురోజుకు పెరుగుతున్నట్టు కనిపిస్తోంది.

Tags

Related Articles

Back to top button
Close