TELANGANA

టీఆర్ఎస్‌పై మాజీమంత్రి అసంతృప్తి… కేసీఆర్‌పై కీలక వ్యాఖ్యలు

తెలంగాణలోని అధికార టీఆర్ఎస్‌పై ఆ పార్టీకి చెందిన మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొంతకాలం నుంచి అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే… అది నిజమే అనిపిస్తోంది. తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి రాజకీయ పరిస్థితులు మీతో పాటు నాకు బాధగానే ఉన్నాయని ఆయన అన్నారు. అయితే మనం పార్టీ లైన్ దాటలేమని…సరిదిద్దాల్సిన భాధ్యత కేసిఆర్‌దే అని తుమ్మల స్పష్టం చేశారు. అప్పటివరకు మనం చూస్తూ ఉండాల్సిందే అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీని మోసే వారిని గెలిపించుకోవాల్సిన అగత్యం మనకు పట్టలేదని తుమ్మల కామెంట్ చేశారు. ప్రతి కార్యకర్త టీఆర్ఎస్ అభ్యర్ధులనే గెలిపించుకోవాలని…కరువు నుండి మిమ్మల్ని బయటపడేసిన సంతృప్తి తనకు ఉందన్న తుమ్మల…ఏ సమస్య వచ్చినా మిమ్మల్ని రక్షించుకునే బాధ్యత తనదే అని స్పష్టం చేశారు. తన ఓటమి కంటే… ఈ ప్రాంతం పచ్చదనంతో ఆనందంగా ఉందని… పాలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలనే తన కోరిక కేసిఆర్ వల్ల తీరిందని తుమ్మల అన్నారు. శాశ్వత నీటి పధకాలే ఉమ్మడి ఖమ్మం జిల్లాను సుభిక్షంగా ఉంచుతాయని వ్యాఖ్యానించారు. పదవులెప్పుడూ శాశ్వతం కాదని… చేసిన పనులు, ప్రజల ముఖాలలో ఆనందమే శాశ్వతమని అన్నారు.

Related Articles

Back to top button
Close