TELANGANA
Trending

హైదరాబాద్‌లో దారుణం… పెళ్లి చేయడం లేదని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

చిన్న చిన్న కారణాలకే యువత ప్రాణం తీసుకుంటుంది. సెల్ ఫోన్ కొనివ్వలేదని కొందరు…పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయని ఇంకొందరు ప్రాణం తీసుకుంటున్నారు. అయితే తాజాగా ఓ యువకుడు తనకు తల్లిదండ్రులు పెళ్లి చేయడం లేదని ఆత్మహత్య చేసుకున్నడు. ఈ విషాదకరమైన ఘటన హైదరాబాద్ ఉప్పల్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం 24ఏళ్ల నిఖిల్ గౌడ్ రామాంత్‌పూ‌ర్‌లో తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నారు. ఉప్పల్ సాఫ్ట్ వేర్ కంపెనీలో నిఖల్ పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం నిఖిల్ అక్కకు తల్లిదండ్రులు పెళ్లి చేసి అత్తారింటికి పంపారు. ఇక అప్పట్నుంచి నిఖిల్  కూడా తనకు పెళ్లి చేయాలంటూ..తల్లిదండ్రుల్ని కోరాడు. దీంతో తల్లిదండ్రులు నిఖిల్‌కు అప్పుడే పెళ్లెందుకు అన్నారు. కొన్నేళ్లు ఆగాలని నిఖిల్‌కు నచ్చచెప్పారు. తల్లిదండ్రుల చెప్పిన మాటలతో నిఖల్ చిన్నబుచ్చుకున్నాడు. అయినా తన పేరెంట్స్ తన పెళ్లి కోసం ఓ మంచి అమ్మాయిని వెతికి పెడతారనుకున్నాడు.

అయితే సోమవారం తల్లిదండ్రులు ఏదో పనిమీద బయటకు వెళ్లారు. వాళ్లు తిరిగి వచ్చేసరికే … నిఖిల్ విగతజీవిగా కనిపించాడు. ఇంట్లోనే సీలింగ్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు సీలింగ్‌కు వేలాడుతున్న నిఖిల్‌ను చూసి షాక్ అయ్యారు. వెంటనే కిందకు దించి దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. అయితే అప్పటికే నిఖిల్ చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిఖిల్ ఇంటికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి అనేక కోణాల్లో దర్యప్తు చేస్తున్నామన్నారు. నిఖిల్ సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకొని.. ఫోరెన్సిక్ నిపుణలుకు అందించామన్నారు. అయితే నిఖిల్ సూసైడ్‌కు సంబంధించి ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదు. పోలీసుల విచారణలో మాత్రం పెళ్లి ఆలస్యం అవుతున్నందునే.. నిఖిల్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

Tags

Related Articles

Back to top button
Close