TELANGANA

కరీంనగర్‌లో అధికారులకు సీఎం కేసీఆర్ క్లాస్

ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికారులకు సీఎం కేసీఆర్ క్లాస్ తీసుకున్నారు. అధికారులు వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు హుందాగా ప్రవర్తించాలని సూచించారు. సైకిల్ ఎక్కడం, ట్రాక్టర్‌పై వెళ్లడంలాంటి పనులు సరికాదని సీఎం కేసీఆర్ వారికి స్పష్టం చేశారు. సొంత పబ్లిసిటీ కోసం పాకులాడొద్దని హెచ్చరించారు. సొంత ఎజెండాలతో పనులు చేయవద్దని…ప్రభుత్వ కార్యక్రమాలే అమలు చేయాలని కేసీఆర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. జూన్ నెలాఖరులోగా ఇరిగేషన్, ఇంజినీరింగ్ విభాగాల్లో ఉన్న ఖాళీలు భర్తీ చేయాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు.

ఏప్రిల్ నెలాఖరులోగా ఇరిగేషన్ అధికారులు, సిబ్బందికి క్వార్టర్లు నిర్మాణం పూర్తవుతుందని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని చెరువులను నింపేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. కరీంనగర్‌తో పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్ల స్థానంలో కొత్త కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టాలి

Tags

Related Articles

Back to top button
Close