TELANGANA
Trending

కత్తి మహేష్‌పై పోలీస్ కేసు… వివాదాస్పద వ్యాఖ్యల దుమారం…

ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ మీద పోలీస్ కేసు నమోదైంది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కత్తి మహేష్ మీద కేసు నమోదు చేశారు. శ్రీ రాముడిపై అవమానకర వ్యాఖ్యలు చేస్తూ, హిందువుల మనోభావాలను కత్తి మహేష్  దెబ్బతీశారంటూ అడ్వకేట్ కె. కరుణ సాగర్ కత్తి నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును నాంపల్లి పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులకు ట్రాన్స్ఫర్ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు క్రైమ్ నెం: 196/2020 u / s 506,507-IPC కింద కత్తి మహేష్ పై కేసు నమోదు చేశారు. ఇప్పటికే కత్తి మహేష్ మీద ఉమేష్ కుమార్ అనే వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల క్రితం సైబర్ క్రైమ్ పోలీసులు కత్తి మహేష్ మీద ఐపీసీ సెక్షన్ 505(1)(c), సెక్షన్ 502 (2) కింద కేసు నమోదు చేశారు. హిందు దేవుళ్లు, హిందు మతాన్ని కించపరిచే విధంగా కత్తి మహేష్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఉమేష్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా అడ్వొకేట్, హింధు సంఘటన్ అధ్యక్షుడు కరుణాసాగర్ కూడా అవే ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఓ మీటింగ్‌‌ను ఉద్దేశించి కత్తి మహేష్ మాట్లాడుతూ హిందు దేవతలను కించపరిచేలా వ్యవహరించారని, ఆయన మీద చర్యలు తీసుకోవాలని కరుణాసాగర్ కోరారు. గతంలో కూడా కత్తి మహేష్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో దుమారం రేపారు.

Tags

Related Articles

Back to top button
Close