LATEST NEWS

తల్లితోపాటు కుమార్తెను రేప్ చేసిన మాంత్రికుడు…

అనారోగ్యాన్ని నయం చేస్తానని చెప్పి ఓ తల్లీకూతుళ్ల మీద అత్యాచారం చేశాడో తాంత్రికుడు. ఉత్తర ప్రదేశ్‌లోని షహనాజ్‌పూర్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జిల్లాలోని ఖుతార్ గ్రామానికి చెందిన ఓ మహిళ భర్తకు అనారోగ్యం ఉంది. దీంతో అతడి అనారోగ్యాన్ని నయం చేయాలంటూ ఔరంగాబాద్‌కు చెందిన ఓ తాంత్రికుడు సాగిర్ ఖాన్‌ను కలిసింది. ఆమె భర్తకు ఉన్న అనారోగ్యాన్ని నయం చేస్తానని చెప్పి ఆమెను సాగిర్ ఖాన్ నమ్మించాడు. ఆమె భర్తకు దెయ్యం పట్టిందని చెప్పాడు. ఆ దెయ్యాలను పాలద్రోలాలంటే కొన్ని పూజలు చేయాలని చెప్పాడు. ఫిబ్రవరి 9న పూజల కోసం ఆమె ఇంటికి వెళ్లాడు. తనతో పాటు ఇద్రిస్ అనే ఓ అసిస్టెంట్‌ను కూడా తెచ్చుకున్నాడు. అనారోగ్యంతో ఉన్న ఆ మహిళ భర్తను ఓ గదిలో బంధించారు. అనంతరం ఆ మహిళ మీద అత్యాచారం చేశారు. ఆ తర్వాత 12 సంవత్సరాల కుమార్తె మీద కూడా లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుల మీద పోలీసులు రేప్ కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడు సాగిర్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు. అతడిని జైలుకు పంపారు. పారిపోయిన మరో నిందితుడు ఇద్రిస్ కోసం వెతుకుతున్నారు.

Related Articles

Back to top button
Close